వేతన సవరణ ఇంకెప్పుడు.?

29-10-2026 | 09:21pm

టీ పెన్షనర్స్ రాష్ట్ర కార్యదర్శి హరి అశోక్ కుమార్

జగిత్యాల,(విజయక్రాంతి): 2023 జూలై 1 నుంచి ఉద్యోగులకు, పెన్షనర్లకు(Pensioners ) రావాల్సిన తెలంగాణ రెండవ వేతన సవరణకు ప్రభుత్వం కమిషన్ ను నియమించి 3 సంవత్సరాలు దాటినప్పటికీ అమలు కాకపోవడంపై  తెలంగాణ పెన్షనర్స్ సెంట్రల్ అసోసియేషన్(Telangana Pensioners' Central Association) రాష్ట్ర కార్యదర్శి హరి అశోక్ కుమార్ ఆందోళన  వ్యక్తం చేశారు. గురువారం జిల్లా అసోసియేషన్ కార్యాలయంలో జిల్లా స్థాయి పెన్షనర్ల సమావేశం జరిగింది.

ఈ సందర్బంగా హరి అశోక్ కుమార్ మాట్లాడుతూ ఎల్ నినో నేపథ్యంలో నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరుగుతున్న పరిస్థితుల్లో కొత్త పీ ఆర్ సీ కోసం ఉద్యోగులు, పెన్షనర్లు ఎదురు చూస్తున్నారని, మానవీయ కోణం లో ప్రభుత్వం అర్థం చేసుకొని 51 శాతం ఫిట్మెంట్ తో వేతన సవరణ కు ఉత్తర్వులు జారీ చేయాలని ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డిని కోరారు.

ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పి. సి. హన్మంత్ రెడ్డి, కోశాధికారి గౌరిశెట్టి విశ్వనాథ్, సహాయ అధ్యక్షులు బొల్లం విజయ్, ఉపాధ్యక్షులు పి. అశోక్ రావు, వి. ప్రకాష్ రావు, ఆర్గనైజింగ్ కార్యదర్శులు  సత్యనారాయణ, ఎం. డి యాకుబ్, ధర్మపురి అధ్యక్షులు కండ్ల గంగాధర్, కార్యదర్శి దుబ్బేశం, పబ్బా శివానందం, కె మురళి, యాకూబ్, నారాయణ, కరుణ, విజయలక్ష్మి వివిధ మండలాల పెన్షనర్ల సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు