ప్రభుత్వ భూమికి హద్దులు నిర్ణయం
విజయక్రాంతి కథనానికి స్పందన
జగిత్యాల, నవంబర్ 6 (విజయక్రాంతి): సోమవారం ప్రజావాణి(Prajavani)లో హస్నాబాద్ సర్పంచ్ దమ్మ రాజమ్మ, జగిత్యాల మున్సిపల్ 15వ వార్డు కౌన్సిలర్ అల్లాల సరిత, రమేష్ రావు ప్రజలతో కలిసి సోమవారం రోజున ప్రజావాణిలో కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. గతంలో కూడా రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసిన ఎలాంటి చర్యలు తీసుకోలేదని గ్రామస్తులు విజయక్రాంతి ప్రతినిధికి తెలిపారు.
ఈ నెల 5న విజయక్రాంతి దినపత్రికలో " కోట్ల భూమి కొట్టేశారు?" కథనం ప్రచురించగా... ఈ కథనానికి స్పందించిన ఉన్నతాధికారులు శుక్రవారం సర్వేయర్, రెవెన్యూ అధికారులను క్షేత్రస్థాయిలో పంపగా రెవెన్యూ అధికారులు గ్రామానికి వచ్చి, గ్రామ, వార్డు ప్రజల సమక్షంలో నిజామాబాద్ పాత రహదారి & ఎన్ హెచ్ -16 పక్కన 1598 సర్వే నంబర్ ప్రభుత్వ భూమిగా హద్దులు నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల సర్వేయర్ రాజు, జీపిఓ లు రాజేందర్, రాజ్ కిషన్, గ్రామస్తులు డి. మల్లారెడ్డి, రమేష్ రావు, గంగాధర్, దామోదర్ రావు, నవీన్, భగవంత రావు, ప్రశాంత్, సురేష్, లక్షణ్ రావు, జితేందర్, సాయి, రవి, సుగుణాకర్, ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయక్రాంతి దినపత్రికకు గ్రామ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.