ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
వందలాదిగా బతుకమ్మలతో తరలివచ్చిన మహిళలు.....
నిజాంసాగర్, జుక్కల్ 13( విజయ క్రాంతి) తెలంగాణ ఆడపడుచులు ప్రతిష్టాత్మకంగా పూజించే పూల పండగ బతుకమ్మ వేడుకలను(Bathukamma celebrations) జుక్కల్ నియోజకవర్గ కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. జుక్కల్ శాసనసభ్యులు తోట లక్ష్మీకాంతరావు(Jukkal MLA Thota Lakshmikantha Rao) ప్రతిష్టాత్మకంగా నియోజకవర్గంలోని అన్ని మండలాల ఆడపడుచులను ఆహ్వానించి బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఆయన సతీమణి తోట అర్చన, వేడుకల్లో పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. గ్రామీణ ప్రాంతాల్లో పూలను పూజించే సంస్కృతిలో భాగంగా తెలంగాణ ఆడపడుచులు ప్రతిష్టాత్మక నిర్వహించే బతుకమ్మ పండుగను స్థానిక ఎమ్మెల్యే సొంత ఖర్చుతో నిర్వహించడం అభినందనీయం. నియోజకవర్గంలోని అన్ని మండలాలకు చెందిన ఆడపడుచులు ప్రతి గ్రామం నుండి బతుకమ్మతో హాజరై వేడుకల్లో పాల్గొన్నారు.
కార్యక్రమంలో బతుకమ్మ అలంకరణలో భాగంగా మొదటి బహుమతిగా 51 వేల రూపాయలు, రెండవ బహుమతి 25వేల రూపాయలు, మూడో బహుమతిగా 11,000 రూపాయలను అందించారు.
కార్యక్రమంలో పీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్, పిట్ల మార్కెట్ కమిటీ చైర్మన్ చీకోటి మనోజ్ కుమార్, జుక్కల్ సర్పంచ్ సావిత్రి సాయ గౌడ్,,అన్ని మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు,సర్పంచులు,నాయకులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.