కిడ్నీ సమస్యతో ఎస్ఈఆర్పీ సీసీ మృతి
టేకులపల్లి, (విజయక్రాంతి): మండలంలో ఎస్ఈఆర్పీ సీసీగా(SERP CC) పనిచేస్తున్న మెంతెన నరేష్ (42) అనారోగ్యంతో మృతి చెందారు. రెండేళ్లుగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్న ఆయన సోమవారం రాత్రి పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రిలో(Palvancha Government Hospital) చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. నరేష్ టేకులపల్లి మండలంలో 11 ఏళ్లుగా ఎస్ఈఆర్పీ సీసీగా సేవలందిస్తున్నారు.
మంగళవారం ఆయన మృతదేహాన్ని స్వగ్రామమైన గుండాల మండలం కాచనపల్లికి తరలించారు. ఆయనకు భార్య అరుణ, కుమారుడు, కుమార్తె ఉన్నారు. నరేష్ మృతితో కుటుంబ సభ్యులు, బంధువులు, సహచరులు విషాదంలో మునిగిపోయారు. ఎస్ఈఆర్పీ సిబ్బంది సంతాపం వ్యక్తం చేసి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.