ఇల్లెందులో గుండెపోటుతో వ్యక్తి మృతి

29-10-2026 | 09:41pm

సీపీఆర్‌ చేసినా దక్కని ప్రాణం.. ఆసుపత్రికి తరలించేలోపే విషాదం

ఇల్లెందు,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలో విషాద ఘటన చోటుచేసుకుంది. కాచనపల్లి గ్రామానికి చెందిన పెనక వీరస్వామి పట్టణంలోని బాలాజీ ఓం ప్రకాష్ స్వీట్ షాప్ ఎదుట అకస్మాత్తుగా గుండెపోటుకు గురై అపస్మారక స్థితిలో కుప్పకూలారు.

వెంటనే స్పందించిన స్వీట్ షాప్ యజమాని, స్థానికులు వీరస్వామికి సీపీఆర్‌ (CPR) చేసి ప్రాణాలు కాపాడేందుకు ప్రయత్నించారు. అనంతరం 108 అంబులెన్స్ సిబ్బంది సహాయంతో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. స్థానికులు సకాలంలో స్పందించి ప్రాణాలు కాపాడేందుకు ప్రయత్నించినప్పటికీ, వీరస్వామి మృతి చెందడంతో విషాదం నెలకొంది.

మరిన్ని వార్తలు