ఈస్ గాం పీఎస్ ను తనిఖీ చేసిన ఎస్పీ

29-10-2026 | 10:05pm

కాగజ్ నగర్,(విజయక్రాంతి): కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా(Komaram Bheem Asifabad District) కాగజ్ నగర్ మండలంలోని ఈస్ గాం పోలీస్ స్టేషన్(Easgaon Police Station) ను గురువారం జిల్లా పోలీసు అధికారి నితికా పంత్(SP Nitika Pant)  తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్  లో  గల రికార్డులు, కేసు నమోదు, పురోగతి తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు. పోలీసులు ప్రజలతో స్నేహపూర్వకంగా ఉండాలని సూచించారు. పోలీస్ స్టేషన్కు  సమస్యలతో వచ్చేవారిపట్ల మర్యాదగా నడుచుకోవాలని ఎస్పీ ఆదేశించారు. అక్రమ వ్యాపారాలు, డ్రగ్స్, అసాంఘిక కార్యకలాపాలపై పోలీసులు నిఘా వేసి ఉండాలని అన్నారు. ఎస్పి వెంట కాగజ్ నగర్ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కె.కుమారస్వామి, స్టేషన్ ఎస్సై నరేష్, సిబ్బంది ఉన్నారు.

మరిన్ని వార్తలు