అంగన్వాడీ సిబ్బందికి సత్కారం
టేకులపల్లి, (విజయక్రాంతి): సేవా సంకల్ప్ అభియాన్లో(Seva Sankalp Abhiyan) భాగంగా టేకులపల్లి మండలంలోని పలు అంగన్వాడీ కేంద్రాలను(Anganwadi Centers) బీజేపీ నాయకులు(BJP leaders) మంగళవారం సందర్శించారు. ఏ కాలనీ తండా, వాగొడ్డు తండా, రోళ్లపాడు, భీల్యతండ తదితర ప్రాంతాల్లోని కేంద్రాల్లో అంగన్వాడీ టీచర్లు, ఆయమ్మలను శాలువాలతో సత్కరించారు. చిన్నారులకు బిస్కెట్లు, చాక్లెట్లు పంపిణీ చేశారు.
చిన్నారుల ఆరోగ్యం, పోషణ, విద్య, సమగ్ర అభివృద్ధికి అంగన్వాడీ సిబ్బంది చేస్తున్న సేవలు అభినందనీయమని నాయకులు పేర్కొన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా కార్యదర్శి బోడ పూనియా నాయక్, మహిళా మోర్చా జిల్లా ఉపాధ్యక్షురాలు బానోత్ గంగా, మండల అధ్యక్షుడు శంభు నాయక్ తదితరులు పాల్గొన్నారు.