కాంట్రాక్టు కార్మికులకు 10 శాతం లాభాల వాటా ప్రకటించాలి

13-10-2026 | 04:50pm

ఐఎఫ్‌టీయూ రాష్ట్ర అధ్యక్షుడు రాసుద్దీన్ డిమాండ్

ఇల్లెందు టౌన్, అక్టోబర్ 13 (విజయక్రాంతి): సింగరేణి కాంట్రాక్టు కార్మికులకు(Singareni contract workers) కేవలం రూ.5,500 లాభాల వాటా ప్రకటించడం అన్యాయమని ఐఎఫ్‌టీయూ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.డి. రాసుద్దీన్, రాష్ట్ర కోశాధికారి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. పర్మినెంట్ కార్మికులతో సమానంగా పనిచేస్తూ సంస్థ లాభాల్లో కీలక పాత్ర పోషిస్తున్న కాంట్రాక్టు కార్మికులకు నికర లాభాల్లో 10 శాతం వాటా ప్రకటించాలని డిమాండ్ చేశారు. సింగరేణికి రూ.1,754 కోట్ల నికర లాభం వచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం, యాజమాన్యం పునరాలోచించి కార్మికులకు న్యాయం చేయాలని కోరారు.

మరిన్ని వార్తలు