ఇంద్రవెల్లి పోరుగడ్డపై సంకల్ప సభ విజయవంతం చేస్తాం...

29-10-2026 | 09:33pm

సంకల్ప సభ  ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు..

ఉట్నూర్, అక్టోబర్ 29( విజయక్రాంతి): ఆరు నెలల క్రితం ఆవిర్భవించిన  తెలంగాణ రక్షణ సమితి వ్యవస్థాపకురాలు కల్వకుంట్ల కవిత(Kalvakuntla Kavitha, founder of the Telangana Rakshana Samithi) ఆధ్వర్యంలో  అదిలాబాద్ జిల్లా  ఇంద్రవెల్లి పోరుగడ్డపై నిర్వహించే పాంచ జన్య  సంకల్ప సభను  భారీ జనంతో  విజయవంతం చేస్తామని టిఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు అన్నారు.

గురువారం సాయంకాలం సంకల్ప సభ ఏర్పాటు స్టేజిని టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు తో పాటు  ఖానాపూర్ నియోజకవర్గం ఇన్చార్జి  మెస్రం దయాకార్ ల తో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1981 ఏప్రిల్ 20న  జరిగిన కాల్పుల్లో  ఎందరో గిరిజనులు అమరులయ్యారని, వారి ఆశయాలు నెరవేరుస్తామంటూ  ఇప్పటివరకు ఎందరో నాయకులు  హామీలిచ్చి గద్దెనెక్కిన  నేటికీ ఆదివాసుల జీవితాల్లో మార్పు రాలేదని  గుర్తు చేశారు.

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత   కేసీఆర్  10 సంవత్సరాలు అధికారంలో ఉన్న  ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధిపై దృష్టి సారించలేదని విమర్శించారు. ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి సర్కార్  మూడేళ్లు అయినా  పోరుగడ్డ ఇంద్రవెల్లి సాక్షిగా, ఆదివాసుల ఆరోగ్య  దేవుడు  నాగోబా సాక్షిగా ఇచ్చిన హామీలు  నేటికీ అమలు కావడం లేదని  గుర్తు చేశారు. ప్రభుత్వ పరంగా  మంజూరు చేసినట్లు ప్రకటించారు తప్ప  పనులు ప్రారంభం కాలేదని  ఆయన ఆరోపించారు.

టిఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షురాలు  ఉమ్మడి జిల్లా ఆదివాసుల తో పాటు గిరిజనేతరుల సమస్యలపై  ప్రస్తావించి ప్రభుత్వంపై  ఒత్తిడి తీసుకువచ్చేందుకే  సంకల్ప సభను నిర్వహిస్తున్నామని గుర్తు చేశారు. రాబోయే 2029లో  కల్వకుంట్ల కవిత తప్పకుండా ముఖ్యమంత్రి పీఠాన్ని అదృష్టస్తారని  జోష్యం చెప్పారు. ఆయనతోపాటు  టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు రూప్ సింగ్ నాయక్, జిల్లా నాయకులు, రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు