అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటరు జాబితాలో ఉండే విధంగా చూడాలి

12-09-2026 | 07:17pm

* ఉట్నూర్ సబ్ కలెక్టర్  ప్రణయ్ కుమార్

 ఉట్నూర్, సెప్టెంబర్ 12( విజయక్రాంతి ):  గ్రామాల్లో అర్హులైన  ప్రతి ఒక్కరి  పేర్లు ఓటర్ల జాబితాలో  ఉండే విధంగా చూడాలని  ఉట్నూర్ సబ్ కలెక్టర్(Sub-Collector)  కే. ప్రణయ్ కుమార్ బిఎల్ఓ లను ఆదేశించారు. శనివారం ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎస్ ఐ ఆర్ నోటీసులు అందుకున్న వారి నుండి ప్రత్యేక దరఖాస్తులు స్వీకరణ కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఓటర్ల జాబితాలో ఓటర్ల పేర్లు తప్పులు రాకుండా  చూసుకోవాలన్నారు.

18 సంవత్సరాల నుండిన  యువతి యువకులు  తమ పేర్లను నమోదు చేసేందుకు పూర్తి వివరాలతో దరఖాస్తు చేసుకోవాలని అన్నారు. ఎస్ ఐ ఆర్  నోటీసులు అందిన ఓటర్లు  ఆదివారం రోజున సైతం పూర్తి వివరాలతో తహసిల్దార్  కార్యాలయంలో , బి ఎల్ ఓ లకు  అందచేయాలని  అన్నారు. ఆదివారం సెలవు దినమైన ఓటర్ల కొరకు రెవిన్యూ అధికారులు అందుబాటులో ఉంటారని  అన్నారు. ఆయనతోపాటు  మండల తహసిల్దార్  ప్రవీణ్ కుమార్, రెవెన్యూ ఇన్స్పెక్టర్  శోభ, రెవిన్యూ సిబ్బంది, బిఎల్వోలు  పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు