అశోక్ నగర్ సేవా సమితి ఆర్థిక సాయం

11-09-2026 | 09:01pm

బేల,(విజయక్రాంతి): మండల కేంద్రంలోని ఇంద్ర నగర్ కాలనీకి చెందిన పెగల్వార్ యోగేష్ భార్య సువర్ణ గత సంవత్సరం నుంచి చిన్నపేగు సంబంధిత అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారు. వైద్య చికిత్స కోసం ఇప్పటివరకు సుమారు రూ.6 లక్షల వరకు ఖర్చు చేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కుటుంబం ఫ్రూట్స్ దుకాణం(Fruit shop)పై ఆధారపడి జీవనం సాగిస్తుండటంతో, అనారోగ్యంతో బాధపడుతున్న సువర్ణ చికిత్సకు మరింత ఆర్థిక సహాయం(Financial Assistance) అవసరమైంది.

ఈ పరిస్థితిని తెలుసుకున్న అశోక్ నగర్ కాలనీ సేవా సమితి(Ashok Nagar Seva Samiti) సభ్యులు మానవతా దృక్పథంతో స్పందించి ఆ కుటుంబానికి రూ.36,000 ఆర్థిక సహాయం అందజేసి అండగా నిలిచారు.సువర్ణకు ముగ్గురు కుమార్తెలు,ఒక కుమారుడు ఉన్నారు.ఆర్థిక ఇబ్బందులతో చికిత్స కొనసాగించేందుకు సహాయం కోసం ఎదురుచూస్తున్న కుటుంబానికి సేవా సమితి సభ్యులు అందించిన సహాయం ఎంతో ఊరటనిచ్చింది.ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు సేవా సమితి సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. అనారోగ్యంతో బాధపడుతున్న సువర్ణకు మరింత మంది దాతలు, సేవా సంస్థలు ముందుకు వచ్చి తమ వంతు సహాయం అందించాలని కోరారు.

మరిన్ని వార్తలు