మట్టి విగ్రహాన్ని పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం

11-09-2026 | 10:30pm

శివంపేట్,(విజయక్రాంతి): దుల్లాపూర్ గ్రామం(Dullapur village)లోని ప్రాథమిక పాఠశాలలో ఉన్నటువంటి పర్యావరణ పరిరక్షణ కమిటీ (Environmental Protection Committee) కి చెందిన విద్యార్థులు మట్టి గణపతి వాడకంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.  ఇందులో భాగంగా విద్యార్థులు మట్టితో గణపతి ప్రతిమలను తయారు చేసి ,పి.ఓ.పి విగ్రహాలు మట్టి విగ్రహాల వలన కలిగే లాభనష్టాలను వివరిస్తూ గోడపత్రికలను తయారు చెసి  గ్రామంలో ప్రదర్శిస్తూ ర్యాలీ నిర్వహించారు. గ్రామంలో ఏర్పాటు చేసే మండపాలలో కూడా మట్టి విగ్రహాన్ని ఏర్పాటు చేసే విధంగా నిర్వాహకులను ప్రోత్సహించాలని గ్రామ పాలకవర్గానికి, గ్రామ కార్యదర్శికి వినతి పత్రం సమర్పించారు.

మరిన్ని వార్తలు