నేరేడ్మెట్లో వడ్డే ఓబన్న విగ్రహం ఏర్పాటు అనుమతి ఇవ్వాలి
మల్కాజిగిరి,(విజయక్రాంతి): నేరేడ్మెట్ లో వడ్డే ఓబన్న విగ్రహం ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని మల్కాజిగిరి వడ్డెర సంఘం, వడ్డే ఓబన్న కమిటీ సభ్యులు కోరారు. శుక్రవారం వారు, మల్కాజిగిరి మున్సిపల్ కమిషనర్(Malkajgiri Municipal Commissioner)ను కలిసి వినతి పత్రం అందజేశారు. అనంతరం మల్కాజిగిరి వడ్డెర సంఘం(Malkajgiri Vaddera Sangam) – వడ్డే ఓబన్న కమిటీ సభ్యులు వేముల రాజు, వేముల నర్సింహా, ఓర్స్ పరుశ రామ్, గిరిశెట్టి రాజు మాట్లాడుతూ... వడ్డే ఓబన్న దేశభక్తి, ధైర్యసాహసాలకు ప్రతీకగా నిలిచిన మహనీ యుడని కొనియాడారు. ఆయన సేవలు, పోరాట స్ఫూర్తిని భవిష్యత్ తరాలకు తెలియజేసేలా నేరేడ్ మెట్లో వడ్డే ఓబన్న విగ్రహాన్ని ఏర్పాటు చేయ నున్నట్లు తెలిపారు.వడ్డెర సమాజం ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచే వడ్డే ఓబన్న విగ్రహం ఏర్పాటుకు అధికారులు సానుకూలంగా స్పందించి, అవసరమైన అనుమతులు మంజూరు చేయాలని వారు కోరారు.