మైపాల్ కుటుంబానికి పోలీస్ శాఖ ఆర్థిక సహాయం

11-09-2026 | 10:08pm

శివంపేట,(విజయక్రాంతి): శివంపేట పోలీస్‌స్టేషన్‌(Shivampet Police Station)లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహించిన మైపాల్ ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ఆయన కుటుంబాన్ని ఆదుకునేందుకు పోలీసుశాఖ ముందుకు వచ్చింది, ఎస్పీ ఆధ్వర్యంలో మైపాల్ కుటుంబ సభ్యులు(maipal family), ఆయన బ్యాచ్‌మేట్స్, ఇతర పోలీసు అధికారులు కలిసి రూ.3,21,000 ఆర్థిక సహాయాన్ని సమకూర్చి అందజేయగా, శివంపేట పోలీస్‌స్టేషన్ తరఫున మరో రూ.1,00,000 ఆర్థిక సహాయాన్ని అందించారు. దీంతో మొత్తం రూ.4,21,000 నగదు సహాయాన్ని మైపాల్ కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా అధికారులు మైపాల్ కుటుంబ సభ్యులను పరామర్శించి వారి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

విధి నిర్వహణలో మైపాల్ అందించిన సేవలను గుర్తుచేసుకున్నారు. సహచరుడిని కోల్పోవడం పోలీసు శాఖ(Police department)కు తీరని లోటని పేర్కొన్నారు. కుటుంబానికి జరిగిన నష్టాన్ని ఎవరూ భర్తీ చేయలేరని, అయితే కష్టకాలంలో కుటుంబానికి అండగా నిలవడం తమ బాధ్యతగా భావించి ఆర్థిక సహాయాన్ని అందించినట్లు తెలిపారు, మైపాల్ కుటుంబానికి భవిష్యత్తులో కూడా అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు పోలీసుశాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని అధికారులు భరోసా ఇచ్చారు, ఈ కార్యక్రమంలో తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్, తూప్రాన్ సీఐ వెంకటరాజు గౌడ్, శివంపేట ఎస్సై మధుకర్ రెడ్డి, పోలీసు అధికారులు, సిబ్బంది, మైపాల్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు, మైపాల్ కుటుంబానికి పోలీసుశాఖ, సహచర సిబ్బంది అందించిన ఈ ఆర్థిక సహాయం మానవీయతకు నిదర్శనంగా నిలిచింది.

మరిన్ని వార్తలు