పోషక విలువలు కలిగిన ఆహారంతో సుఖ ప్రసవం
ఐసీడీఎస్ సీడీపీఓ సత్యవతి
సత్తుపల్లి,(విజయక్రాంతి): గర్భిణీలు పోషక విలువ కలిగిన ఆహారం తీసుకుంటే, రక్తహీనత, సమస్యలు లేకుండా సుఖ ప్రసవం అవుతారని సిడిపిఓ సత్యవతి(ICDS CDPO Satyavati) అన్నారు. మండల పరిధిలోని కిష్టారం 6 అంగన్వాడి కేంద్రంలో టీచర్ మాధవి ఆధ్వర్యంలో నిర్వహించిన పోషకాహార మాస ఉత్సవాలలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గర్భిణీగా గుర్తించిన దగ్గర్నుంచి, పోషక విలువలు కలిగిన ఆహారం తీసుకున్నట్లయితే పుట్టబోయే బిడ్డ సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటాడని అన్నారు.
కిష్టారం సెక్టార్ సూపర్వైజర్ రజిని మాట్లాడుతూ... వ్యక్తిగత ,పరిసరాల పరిశుభ్రత పాటించాలని దీని ద్వారా అనారోగ్య సమస్యలు రావని, పరిశుభ్రత ప్రధానమని, పరిశుభ్రత పై అవగాహన కల్పించారు. పరిశుభ్రత వలన వ్యాధులు దరి చేరకుండా ఉంటాయన్నారు. చిన్నారులను ప్రైవేటు పాఠశాలకు వ్యానులు ఎక్కించి పంపించ వద్దన్నారు. స్థానికంగా అంగన్వాడి కేంద్రాలకు పంపించి బలోపేతం చేయాలని అన్నారు. అనంతరం తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషక విలువలు కలిగిన,అదనపు ఆహారాన్ని ప్రదర్శించి తయారు చేసే విధానాన్ని తల్లులకు వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ పాఠశాల హెచ్ఎం రాంబాబు,ఏఎన్ఎం పద్మ, చిన్నారులు ,గర్భిణీలు, బాలింతలు పాల్గొన్నారు.