తెలంగాణ విమోచన దినోత్సవం అధికారికంగా నిర్వహించాలి
బిజెపి జిల్లా అధ్యక్షులు నీలం చిన్నరాజులు
కామారెడ్డి,(విజయక్రాంతి): తెలంగాణ విమోచన దినోత్సవాన్ని(Telangana Liberation Day) రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని బిజెపి జిల్లా అధ్యక్షులు నీలం చిన్నరాజులు(BJP district president Neelam Chinna Rajulu) కోరారు. శుక్రవారం కామారెడ్డి కలెక్టరేట్ లోని ఏవో కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా బిజెపి జిల్లా అధ్యక్షులు నీలం చిన్న రాజులు మాట్లాడుతూ దేశానికి స్వాతంత్రం వచ్చాక కూడా నిజాం నేరంకుశ పాలల్లో తెలంగాణ మగ్గిపోయింది అని అన్నారు. మాజీ ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ చేపట్టిన సైనిక చర్య వల్ల 1948 సెప్టెంబర్ 10 ఉన్న నియంత నిజాం పాలన నుండి తెలంగాణకి విమోచనం కలిగిందన్నారు.
నాటి నిజాంబాద్ నాకు తెలవల్ల ఎంతో మంది ధనమాల ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చిందని నాటి గాయకు గుర్తులు నేటి సమాజానికి తెలిసేలా సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవం ను ప్రభుత్వం అధి కారికంగా నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి నరేందర్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి, విపుల్ జైన్, నరేందర్, మోటూరి శ్రీకాంత్, రాజు పాటిల్, కాసర్ల రవీందర్, బిజెపి కౌన్సిలర్ లు పాల్గొన్నారు.