హుస్నాబాద్‌లో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం

30-10-2026 | 07:01pm

రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ధాన్యం కొనుగోలు చేపట్టాలి: పక్కిర్ కొండల్ రెడ్డి

ఆలేరు,(విజయక్రాంతి): భువనగిరి పీఏసీఎస్ ఆధ్వర్యంలో 14వ వార్డు హుస్నాబాద్‌లో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాన్ని భువనగిరి పీఏసీఎస్ చైర్మన్ పక్కిర్ కొండల్ రెడ్డి(Bhongir PACS Chairman Pakkir Kondal Reddy) ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ధాన్యం కొనుగోలు ప్రక్రియను సజావుగా నిర్వహించాలని సంబంధిత అధికారులకు సూచించారు. రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని, పండించిన ప్రతి గింజను విక్రయించుకునేలా కొనుగోలు కేంద్రాల ద్వారా తగిన ఏర్పాట్లు చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో 14వ వార్డు కౌన్సిలర్ తుమ్మేటి పాండు యాదవ్, హరినాథ్ యాదవ్, వల్లపు సత్తయ్య, ఎల్‌ఏటీ ధర్మారెడ్డి, అశోక్, శ్రీశైలం, రవి, ఇతర నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు