సమస్యల పరిష్కారం కోసం ఉపాధ్యాయుల నిరసన
30-10-2026 | 10:08pm
గణపురం, అక్టోబర్ 30 (విజయ క్రాంతి): దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ గణపురం మండల కేంద్రంలోని తెలంగాణ ఆదర్శ పాఠశాల ఉపాధ్యాయులు(Telangana Model School Teachers) శుక్రవారం విరామ సమయంలో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు.పాత పెన్షన్ విధానం అమలు, 010 ద్వారా వేతనాలు చెల్లింపు, పీజీటీలకు జేఎల్ స్కేలు వర్తింపు, డీఏ బకాయిల చెల్లింపు, సీపీఎస్ మ్యాచింగ్ గ్రాంట్ విడుదలతో పాటు ఇతర సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు.