ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ప్రభుత్వ విప్ , ఎమ్మెల్యే

30-10-2026 | 10:20pm

సుల్తానాబాద్, అక్టోబర్ 29 (విజయ క్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్  మండలం చిన్న కల్వల సింగిల్ విండో ఆధ్వర్యం లో  చిన్న బొంకూర్ , పెరికపల్లి, మియాపూర్ లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను  స్థానిక నాయకులతో కలిసి ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే చింతకుంట  విజయరమణరావు(MLA Chintakunta Vijayaramana Rao) శుక్రవారం సాయంత్రం  ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయరమణ రావు మాట్లాడుతూ సూపర్ ఏలినోనో కారణంగా కరువు ఏర్పడనుందని రైతులందరూ వరి పంట కాకుండా ఆరు తడి పంటలు సాగు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమం లో సింగిల్ విండో చైర్మన్ గౌరవెల్లి మురళీధర్ రావు  , మార్కెట్ చైర్మన్ మినుపాల ప్రకాష్ రావు , సీఈవో వల్ల కొండ రమేష్ , సర్పంచులు,  కాంగ్రెస్ నాయకులు, సంఘ సిబ్బంది ,రైతులు తదితరులు పాల్గొన్నారు....

మరిన్ని వార్తలు