జానపద నృత్యంలో యూఆర్ఎస్‌కు ప్రథమ స్థానం

30-10-2026 | 10:06pm

- రాష్ట్రస్థాయి పోటీలకు విద్యార్థుల ఎంపిక

మంచిర్యాల క్రైమ్,(విజయక్రాంతి): పీపుల్ ఎడ్యుకేషన్ సెల్(People's Education Cell) ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా సైన్స్‌ సెంటర్‌(Mancherial District Science Centre)లో గురువారం నిర్వహించిన జిల్లా స్థాయి జానపద నృత్య పోటీల్లో యూఆర్ఎస్ మంచిర్యాల విద్యార్థులు ప్రథమ స్థానంలో నిలిచారు. దీంతో వారు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. జిల్లాలోని వివిధ పాఠశాలలకు చెందిన 13 బృందాలు ఈ పోటీల్లో పాల్గొని జానపద నృత్యాలతో ఆకట్టుకున్నాయి. పోటీల్లో తాళ్లపేట జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్థులు(Students) ద్వితీయ స్థానం, భీమారం కేజీబీవీ విద్యార్థులు తృతీయ స్థానం సాధించారు.

న్యాయ నిర్ణేతలుగా కొండ జనార్దన్, రాజన్న, సుమన, చైతన్య వ్యవహరించారు. జిల్లా విద్యాశాఖ అధికారి పి. చంద్రయ్య అనుమతితో నిర్వహించిన ఈ కార్యక్రమంలో క్వాలిటీ కోఆర్డినేటర్ జంబోజు సత్తయ్య, జిల్లా సైన్స్ అధికారి రాజగోపాల్ పాల్గొన్నారు. విజేతలకు జ్ఞాపికలు, ప్రశంసాపత్రాలు అందజేశారు. విద్యార్థుల్లో సృజనాత్మకత, సాంస్కృతిక విలువలు, జానపద కళలపై ఆసక్తిని పెంపొందించేందుకు ఇలాంటి పోటీలు దోహదపడతాయని నిర్వాహకులు తెలిపారు.

మరిన్ని వార్తలు