సైబర్ నేరాల పట్ల విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలి

30-10-2026 | 09:44pm

పోలీస్ అమరవీరుల స్మారకంగా వ్యాసరచన పోటీలు

మునుగోడు, అక్టోబరు 30(విజయక్రాంతి): సమాజంలో సైబర్ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని మునుగోడు ఎస్హెచ్ఓ శోభన్ బాబు(Munugode SHO Shobhan Babu) అన్నారు.పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా మునుగోడులో విద్యార్థులకు మండల స్థాయి వ్యాసరచన పోటీలు మండల విద్యాధికారి తల్లమల్ల మల్లేశం ఆధ్వర్యంలో శుక్రవారం మండల విద్యా వనరుల కేంద్రంలో 6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు పోటీలు నిర్వహించారు.

మునుగోడు ఎస్సై శోభన్‌బాబు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఆన్‌లైన్ మోసాలు, వ్యక్తిగత సమాచార దుర్వినియోగంపై అవగాహన కలిగి ఉండాలన్నారు. మాదకద్రవ్యాల వినియోగం వల్ల జీవితాలు నాశనమవుతాయని, విద్యార్థులు వాటికి దూరంగా ఉండాలని సూచించారు.సైబర్ నేరాల నియంత్రణలో పౌరులు, పోలీసుల పాత్ర, మాదకద్రవ్యాల నివారణలో పోలీసుల బాధ్యత తదితర అంశాలపై తెలుగు, ఆంగ్ల మాధ్యమాల్లో పోటీలు నిర్వహించారు.

ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఎస్సై బహుమతులు అందజేశారు.ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు కే.బాలప్రసాద్, హోస్ట్ కుడతాల రత్నయ్య, ఉపాధ్యాయులు గ్యార నర్సింహ, నలపరాజు వెంకన్న, గంగావతి, సదాలక్ష్మి, వెంకటేశ్వర్లు, చంద్రం, సుధాకర్‌రెడ్డి, జాల నాగమణి, సత్తిరెడ్డి, నాగరాజు, సతీష్, అంజయ్య తదితరులు ఉన్నారు.

మరిన్ని వార్తలు