ఎల్‌నినోపై ప్రజలకు అవగాహన
నీటిని పొదుపుగా వినియోగించుకోవాలి
ఆందోళన చెందాల్సిన అవసరం లేదు
ఆలేరు,(విజయక్రాంతి): భువనగిరి పట్టణంలోని 22వ వార్డు కమ్యూనిటీ హాలులో స్థానిక కౌన్సిలర్ జాలిగం విఘ్నేష్(Councilor Jaligam Vignesh) అధ్యక్షతన వార్డు సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎల్‌నినో ప్రభావం, రానున్న రోజుల్లో నీటి లభ్యతపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ జాలిగం విఘ్నేష్ మాట్లాడుతూ ఎల్‌నినో ప్రభావం(El Nino impact)పై ప్రజలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు.
భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి సహకారంతో వార్డులో నాలుగు మోటార్లు ఏర్పాటు చేయడంతో పాటు, రెండు నూతన వాటర్ ట్యాంకులను నిర్మించినట్లు వివరించారు. నీటి సరఫరాకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామని, అయితే ప్రజలు నీటిని వృథా చేయకుండా పొదుపుగా వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఇంజినీర్ రంజిత్, వార్డు ఆఫీసర్ దోసపాటి శ్రీనివాస్, జవాన్ శ్రీధర్, బాసాని నర్సమ్మ, లక్ష్మి, అనురాధ, మహేందర్ తదితరులు పాల్గొన్నారు.