6 September, 2026 | 9:40 PM

ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ మండల నూతన కమిటీ ఏకగ్రీవ ఎన్నిక

06-09-2026 | 08:33pm

మఠంపల్లి సెప్టెంబర్ 06( విజయ క్రాంతి):మండల కేంద్రంలో ఎమ్మార్పీఎస్(MRPS), ఎంఎస్పీ(MSP) నూతన మండల కమిటీల ఎన్నిక ఏకగ్రీవంగా జరిగింది.ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు మఠంపల్లి మండల ఇన్చార్జి చింతిర్యాల బాలచంద్రుడు మాదిగ అధ్యక్షతన ఆదివారం  నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా సూర్యాపేట జిల్లా ఇన్చార్జి బచ్చలకూరి వెంకటేశ్వర్లు మాదిగ హాజరై మాట్లాడారు. మాదిగల హక్కుల సాధన,ఎస్సీ వర్గీకరణ లక్ష్యాల కోసం ప్రతి ఒక్కరూ క్షేత్రస్థాయిలో ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు.

ఏకగ్రీవంగా ఎన్నికైన నూతన కార్యవర్గం మండల ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడిగా కాంపాటి సందీప్ మాదిగ ఉపాధ్యక్షులుగా కుర్రి శ్రీనివాస్ మాదిగ,కాటేపల్లి మల్లేష్ మాదిగ దైద ప్రభాకర్ మాదిగ ఎన్నికయ్యారు.ప్రధాన కార్యదర్శిగా కొమ్ము కరుణాకర్ మాదిగ,మీగత కమిటీ సభ్యులు ఎన్నికయ్యారు.ఎమ్మార్పీఎస్ అనుబంధ విభాగమైన ఎంఎస్‌ఎఫ్ స్టూడెంట్ ఫెడరేషన్ మండల అధ్యక్షుడిగా చిన్నపంగు మధు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.ఈ సమావేశంలో సీనియర్ నాయకులు కొండపల్లి ఆంజనేయులు మాదిగ, బచ్చలకూరి ప్రసాద్ మాదిగ, మాజీ మండల అధ్యక్షుడు ఇరుగు ప్రభు మాదిగ,కస్తాల వెంకటేశ్వర్లు మాదిగ తదితరులు పాల్గొన్నారు



మరిన్ని వార్తలు