ఉపాధ్యాయ దినోత్సవంలో ఎంపీ రఘునందన్ రావు
చేర్యాల , సెప్టెంబర్ 6 (విజయక్రాంతి): ట్రస్మా సిద్దిపేట(TRUSMA Siddipet) జిల్లా ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఆదివారం కెఎంఆర్ కన్వెన్షన్ హాల్(KMR Convention Hall), ప్రజ్ఞాపూర్ లో గురు పూజోత్సవం -2026 వేడుకలు జరిగాయి. చేర్యాల పట్టణంలోని పంచతంత్ర పాఠశాల ఉపాధ్యాయులు సిహెచ్. అనూష, ఈ.సంధ్య ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికయ్యారు. వీరికి మెదక్ ఎంపీ రఘునందన్ రావు(Raghunandan Rao) ముఖ్యఅతిథిగా హాజరై వారికి బహుమతులు అందజేశారు.
ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ బాలకిషన్, ప్రిన్సిపల్ శ్యామల ఉత్తమ ఉపాధ్యాయులను అభినందించారు.ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ యాదవ రెడ్డి, ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి, మాజీ చైర్మన్ వి. ప్రతాప్ రెడ్డి గౌరవ అతిథులుగా పాల్గొన్నారు.






