భారత్‌లో H12 డ్యూయల్ ఫ్లెక్స్‌రీచ్ వాక్యూమ్ విడుదల చేసిన డ్రీమ్ టెక్నాలజీ
న్యూఢిల్లీ, ఇండియా, 1 సెప్టెంబర్ 2026: స్మార్ట్ హోమ్ ఆవిష్కరణలలో ప్రపంచ అగ్రగామి డ్రీమ్ టెక్నాలజీ(Dreame Technology), శక్తిమంతమైన శుభ్రపరిచే పనితీరు, అనేక పనులు, అధునాతన శుభ్రపరిచే సాంకేతికతలను ఒకచోట చేర్చే బహుముఖ 6-ఇన్-1 డ్రీమ్ H12 డ్యూయల్ ఫ్లెక్స్‌రీచ్ వెట్ & డ్రై వాక్యూమ్‌ను భారతదేశంలో విడుదల చేస్తున్నట్లు ఈరోజు ప్రకటించింది.
రోజువారీ ఇంటి శుభ్రతను సులభతరం చేసేందుకు రూపొందించిన ఈ కొత్త వెట్ అండ్ డ్రై వాక్యూమ్, సెప్టెంబర్ 01 నుంచి అమెజాన్‌లో రూ. 44,999 ధరకు, అలాగే డ్రీమ్ ఇండియా అధికారిక వెబ్‌సైట్, క్రోమా మరియు ఎంపిక చేసిన రిటైల్ స్టోర్లలో అందుబాటులో ఉంటుంది.డ్రీమ్ H12 డ్యూయల్ ఫ్లెక్స్‌రీచ్ వెట్ & డ్రై వాక్యూమ్ ప్రధాన ఆకర్షణ దాని బహుముఖ 6-ఇన్-1 శుభ్రపరిచే సామర్థ్యం. ఇది వివిధ ఉపరితలాలపై అనేక రకాల రోజువారీ శుభ్రపరిచే అవసరాలు తీర్చడానికి రూపొందించబడింది.
గట్టి నేలలను కడగడం, వాక్యూమ్ చేయడం నుంచి కార్పెట్లు, సోఫాలు, కర్టెన్లు, కీబోర్డులు, కార్ ఇంటీరియర్లు శుభ్రపరచడం వరకు ఈ పరికరం అధిక సౌలభ్యం కోసం శక్తిమంతమైన పనితీరు, మార్చుకోగలిగే అటాచ్‌మెంట్స్ కలిగి ఉంది. దీని 180° ఫ్లాట్‌గా డిజైన్ తక్కువ ఎత్తు ఉన్న ఫర్నిచర్ కిందకు చేరుకోవడానికి వీలు కల్పిస్తుంది. 23,000Pa సక్షన్, టాంగిల్‌కట్™ రెసిలియంట్ స్క్రాపర్, వేరు చేయగల బ్యాటరీ దీని శుభ్రపరిచే పనితీరు, సౌలభ్యాన్ని మరింత మెరుగుపరుస్తాయి. 90°C హాట్-వాష్ సెల్ఫ్-క్లీనింగ్ సిస్టమ్ నిర్వహణను సులభతరం చేసే H12 డ్యూయల్ ఫ్లెక్స్‌రీచ్ రోజువారీ ఇంటి శుభ్రతకు ఒక చక్కని పరిష్కారంగా నిలుస్తుంది.
డ్రీమ్ టెక్నాలజీ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ మను శర్మ మాట్లాడుతూ, " రోజువారీ శుభ్రత పనుల కోసం మరింత తెలివైన, సౌకర్యవంతమైన మార్గాల కోసం భారతీయ కుటుంబాలు ఎక్కువగా చూస్తున్నందున, విభిన్న శుభ్రపరిచే అవసరాలకు అనుగుణంగా మారగల పరిష్కారాలపై అంచనాలు పెరుగుతున్నాయి. డ్రీమ్ H12 డ్యూయల్ ఫ్లెక్స్‌రీచ్ తక్షణ, లక్షిత శుభ్రపరిచే అవసరాల కోసం వినియోగదారులకు ఎక్కువ సౌలభ్యం, నియంత్రణను అందించడంపై మా దృష్టి ఉంది.
ఇది వినియోగదారులు శ్రమ తగ్గిస్తూ వివిధ ప్రాంతాలు, ఉపరితలాలపై రోజువారీ మురికిని మరింత సులభంగా తొలగించేలా చేస్తుంది." ఆధునిక భారతీయ కుటుంబాల విభిన్న దినచర్యలకు అనుగుణమైన ఆచరణాత్మక, తెలివైన గృహ శుభ్రపరిచే పరిష్కారాలను అభివృద్ధి చేయాలనే డ్రీమ్ నిబద్ధతను ఇది ప్రతిబింబిస్తుంది” అన్నారు.
డ్రీమ్ H12 డ్యూయల్ ఫ్లెక్స్‌రీచ్‌కు 1-సంవత్సరం వారెంటీ, భారతదేశంలోని 160కి పైగా నగరాల్లో విస్తరించి ఉన్న డ్రీమ్ దేశవ్యాప్త అమ్మకాల తర్వాత సేవా నెట్‌వర్క్ తోడ్పాటు ఉంది. అర్హత గల ప్రదేశాలలో వినియోగదారులు పికప్, డ్రాప్ సాయం, ఇన్‌స్టాలేషన్ తోడ్పాటు సహా ప్రత్యేక సహాయ సేవలు కూడా పొందవచ్చు. H12 డ్యూయల్ ఫ్లెక్స్‌రీచ్ విడుదలతో భారతదేశంలో డ్రీమ్ తన స్మార్ట్ హోమ్ పోర్ట్‌ఫోలియో విస్తరిస్తూనే ఉంది. ఇది బహుముఖ శుభ్రపరిచే సామర్థ్యాలు, సహజమైన డిజైన్‌ను ఒకచోట చేర్చి రోజువారీ ఇంటి సంరక్షణను సులభతరం చేస్తుంది, ఆధునిక గృహాల్లో శుభ్రపరిచే పనిని మరింత సౌకర్యవంతంగా చేస్తుంది.






