6 September, 2026 | 7:39 PM

కాంగ్రెస్‌ హామీలకు బాకీ కార్డులు

06-09-2026 | 06:12pm

వెయ్యి రోజుల వైఫల్యాలపై బీఆర్‌ఎస్‌ ఇంటింటి ప్రచారం

దోమకొండ, సెప్టెంబర్‌ 6 (విజయ క్రాంతి): కాంగ్రెస్‌ ప్రభుత్వం(Congress government) ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఆరోపిస్తూ బీఆర్‌ఎస్‌(BRS) ఆధ్వర్యంలో దోమకొండ మండలంలో ‘కాంగ్రెస్‌ బాకీ కార్డుల’ పంపిణీ చేపట్టారు. వెయ్యి రోజుల వైఫల్య నిరసనలో భాగంగా నాయకులు, కార్యకర్తలు ఇంటింటికీ తిరిగి ప్రజలకు కరపత్రాలు అందజేశారు.

మహిళలకు రూ.2,500 సాయం, తులం బంగారం, పింఛన్ల పెంపు, రైతు భరోసా, రూ.2 లక్షల రుణమాఫీ, ధాన్యానికి రూ.500 బోనస్‌, నిరుద్యోగ భృతి తదితర హామీలు అమలు కాలేదని ఆరోపించారు. హామీలను నెరవేర్చే వరకు ప్రజల తరఫున పోరాటం కొనసాగిస్తామని బీఆర్‌ఎస్‌ నాయకులు తెలిపారు.

కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కుంచాల శేఖర్, మండల అధ్యక్షుడు మధుసూదన్, ఉప సర్పంచ్ బొమ్మెర శ్రీనివాస్, గజవాడ  శ్రీకాంత్, బోరెడ్డి కిషన్, పాలకుర్తి శేఖర్,  నాగరాజు, పోశయ్య, రవి, రాజేందర్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు