కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో బీఆర్ఎస్ఎల్పీ సమావేశం
హైదరాబాద్: కల్వకుంట్ల చంద్రశేఖరరావు(Kalvakuntla Chandrashekar Rao) అధ్యక్షతన ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్(KCR's farmhouse)లో బీఆర్ఎస్ఎల్పీ సమావేశం ప్రారంభమైంది. BRSLP సమావేశానికి కేటీఆర్(Kalvakuntla Taraka Rama Rao), హరీశ్ రావు, ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు హాజరయ్యారు. ఈ భేటీలో అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై కీలకంగా చర్చించనున్నారు. బీఆర్ఎస్ కార్యాచరణపై ఎమ్మెల్యేలకు కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. సోమవారం ప్రారంభం కానున్న తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు వాడివేడిగా సాగే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి.
అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం BRS పరస్పరం తలపడేందుకు సిద్ధమవుతుండగా, వివిధ అంశాలపై ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు BJP ప్రయత్నిస్తోంది. అన్ని అంశాలపై చర్చకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy), 2023 డిసెంబర్‌లో అధికారం కోల్పోయినప్పటి నుండి BRS అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు తన ఫామ్‌హౌస్‌కే పరిమితమై, అసెంబ్లీకి, బహిరంగ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంటున్నారని విమర్శించారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలంటూ టీపీసీసీ ఆధ్వర్యంలో ఇందిరాపార్క్ వద్ద కాంగ్రెస్ నేతలు మహా ధర్నా నిర్వహించారు.






