6 September, 2026 | 10:35 PM

అఖండ జ్యోతి కార్యక్రమంతో మరింతపెరిగిన భక్తి భావన

06-09-2026 | 09:09pm

బోథ్. సెప్టెంబర్ 6 (విజయక్రాంతి): అఖండ జ్యోతి కార్యక్రమంతో కనుగుట్ట గ్రామంలో భక్తి భావన మరింతగా పెరుగుతుందని మాజీ ఎంపీ సోయం బాపూరావు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి ఆడే గజేందర్లు పేర్కొన్నారు. ఆదివారం మండలంలోని కనుగుట్ట గ్రామంలో నిర్వహిస్తున్న అఖండ జ్యోతి కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు శబరి మాత ఆశ్రమంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు అనంతరం. వారు మాట్లాడుతూ.. శబరిమాత భక్తులు జిల్లా వ్యాప్తంగా ఎంతో మంది ఉన్నారని వారు మానసిక ప్రశాంతతతో పాటు భక్తి భావన పెంపొందించే విధంగా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమన్నారు.

గ్రామస్తుల కోరిక మేరకు షెడ్ల నిర్మాణానికి ముందుకు రావడం జరిగిందని గ్రామస్తులు చూపించిన చొరవ అభినందనీయం అన్నారు. రానున్న రోజుల్లో ఐకమత్యంతో కార్యక్రమాలను విజయవంతం చేయాలని సూచించారు. ఈ సందర్భంగా సహకార సంఘం జిల్లా అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ నాయకులు గోక గణేష్ రెడ్డి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బొడ్డు గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు