6 September, 2026 | 10:17 AM

సోమనాథ ఆలయం

06-09-2026 | 05:15am

తెలంగాణాలో దేవాలయాలకు విశిష్ఠ స్థానముంది. ఇక్కడి దేవాలయాలు బౌద్ధ స్థూపాలతో మొదలై నిన్న, మొన్నటి యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి కొత్త దేవాలయం దాక పేర్కొనబడతాయి. కాకతీయుల కాలంలో నిర్మించిన దేవాలయాల నిర్మాణ రీతులు, శిల్ప వైవిధ్యం ప్రత్యేకమైనవి. కాకతీయ శిల్పమనే పేరు వచ్చింది.

వరంగల్ నగరంలో, హన్మకొండ పట్టణంలో కాకతీయ దేవాలయాలు (Kakatiya Temples) ప్రసిద్ధమైనవి. వరంగల్లు కాకతీయుల రాజధానిగానే కాక గొప్ప వ్యాపార కేంద్రంగా వర్ధిల్లింది. పక్కనున్న ఐలేని (ఐనవోలు, అయ్యనవోలు) ఒక అయ్యావళి -500వంటి వ్యాపార సంస్థచేత నిర్మింపబడ్డ నకరం(నగరం). వ్యాపార శ్రేణి కూడలి(Commercial Hub Junction) .

వరంగల్లులో మట్టెవాడ అనే ప్రాంతం పూర్వం 8వందల సంవత్సరాల కిందట పెద్ద వ్యాపార కేం ద్రం. నకరం అని పిలువబడ్డది. వ్యాపార కూడలిలో వ్యాపా రులు స్థానిక ప్రజల మతం, అభిమతాలక నుగుణంగా దేవాలయాలను నిర్మింపజేసేవా రు. మట్టెవాడలో ఇపుడు ‘భోగేశ్వరాలయం’గా పిలువబడుతున్న గుడి శాసనంలో పేర్కొనబడ్డ విధంగా ‘సోమనాథ దేవాలయం. కాకతీయ గణపతిదేవుని నుంచి ప్రతాపరుద్రుని వరకు రామనాథ, సోమనాథ దేవాలయాలు నిర్మాణ మైనట్టు శాసనాల ఆధారాలు లభిస్తున్నాయి. 

మట్టెవాడలో శాసనంలో ఏముంది?

మట్టెవాడలో లభించిన శాసనంలో తేదీ లేదు కాని, రాజు (మండలేశ్వరుని)గా కాకతి గణపతిదేవుడు పేర్కొనబడ్డాడు కనుక ఈ గుడి క్రీ.శ.13వ శతాబ్దం మొదటి అర్థభాగంలో వేయించబడినదని చెప్పొచ్చు. ఈ శాసనంలో, ‘శ్రీమన్మహా మండలేశ్వర గణపతిదేవ మహా రాజులు’ పాలిస్తున్న కాలంలో, పంచలోహాల బేహారమాడెడి నఖరం(పంచలోహాలతో వ్యాపారం చేసే వ్యాపార(కే్ంరద్రమైన నకరం) శ్రేణి, పరిమళద్రవ్యాల బేపారమాడే బేపారులు, సంతలు నిర్వహించే వ్యాపారులు కలిసి మట్టెవాడ సోమ నాథదేవరకు ఎల్లకాలం చెల్లేటట్టు వ్రిత్తిగా దానాలు చేసారు’ అని వుంది.

(వరంగల్లు జిల్లా శాసనసంపుటి-శా.సం.68, పే. 211-23) క్రీ.శ.1228లో వేసిన గిర్మాజీపేట శాసనంలో మట్టియ (మఠియ) స్థలానికి చెందిన ధర్మసాలీలు ‘సాలేశ్వరదేవర’ను ప్రతిష్టించినట్లున్నది. అపుడు వరంగల్, హన్మకొండ, మట్టెవా డలు కలిపి ఒక స్థలం. వరంగల్లు, హన్మకొండల నడుమవున్న మట్టెవాడ అప్పటి నుంచి ఇప్పటివరకు వ్యాపారకూడలే. 

నాటి మఠియ నేటి మట్టెవాడ

కాకతీయుల రాజధాని పట్టణమైన వరంగల్లు ఒక వాణిజ్య కేంద్రం. ఇక్కడి అంగడిని ‘మఠియ’ అని పిలిచేవారు. అదే నేటి మట్టెవాడ. మఠియ అనే మాట కాకతి గణపతిదేవుని శాసనాల్లో చాలాసార్లు కనపడుతుంది. (పివి పరబ్రహ్మశాస్త్రి-కాకతీయులు, పే.152). మట్టెవాడ శివాలయం పేరు సోమ నాథ దేవాలయం. కాని, భోగేశ్వరాలయంగా పిలుస్తున్నారు. భోగి(సర్పం)చేత పూజింపబడుతున్న శివలింగముంది కనుక భోగేశ్వరాలయమని చెప్పడం కట్టుకథ. శాసనంలో ఉన్న పేరు వేరే.

రామప్పలో కూడా రుద్రేశ్వరుడని శాసనంలో ఉన్నా రామలింగేశ్వరుడని పిలుస్తున్నారు. శాసనాల ఆధారంగా పేర్లను మార్చితే చరిత్ర కూడా గుర్తుంటుంది. ఈ గుడిలో ఉన్న మూడు శివలింగాలలో రెండు బాణలింగాలు. (నర్మ దానదివంటి నదులలో ఏరి తెచ్చిన గుండ్రని, అండా కారపు రాళ్ళు. వాటిని బాణమని పిలుస్తారు. వాటిని ప్రతిష్టిస్తే అవి బాణలింగాలు.) ఒక సమతల శీర్షోపరితలంతో సమ లింగం ఉన్నాయి. వాటి వెనక ప్రతిష్టితమైన శిల్పం సోమనాథునిది.

గర్భాలయానికి ఉన్న శైవద్వారపాలకులు. చతుర్భుజులు. వారిద్దరికి ఇద్దరిద్దరు చామరధారిణులున్నారు. దేవాలయ మంటపంలోని స్తంభాలు పునరుద్ధరణ కొత్తగా నిలిపినవి. అవి కాకతీయశైలి స్తంభాలు కావు. గుడిబయట చెట్టు కింద ఒక సతిశిల వుంది. వీరుడు మరణిస్తే అతనితోపాటు ప్రాణాలువదిలిన స్త్రీ శిల్పాలు. ఆ శిలమీద సూర్య,చంద్రులు కింద చెక్కివున్నాయి. వారి కీర్తి ఆచంద్రార్కం వుండాలని సంకేతం.

గిర్మాజీపేట శాసనం

క్రీ.శ.1228లో వేసిన గిర్మాజీపేట శాసనంలో మట్టియ (మఠియ) స్థలానికి చెందిన ధర్మసాలీలు ‘సాలేశ్వరదేవర’ను ప్రతిష్టించినట్లున్నది వరంగల్లు, హన్మకొండల నడుమవున్న మట్టెవాడ అప్పటి నుంచి ఇప్పటి వరకు వ్యాపారకూడలే.  కాకతీయుల రాజధాని పట్టణమైన వరంగల్లు ఒక వాణిజ్య కేంద్రం. ఇక్కడి అంగడిని ‘మఠియ’ అని పిలిచేవారు. అదే నేటి మట్టెవాడ. మఠియ అనే మాట కాకతి గణపతిదేవుని శాసనాల్లో చాలాసార్లు కనపడుతుంది.

(పివి పర బ్రహ్మశాస్త్రి-కాకతీయులు, పే.152). మట్టెవాడ శివా లయం పేరు సోమనాథ దేవాలయం. కాని, భోగే శ్వరాలయంగా పిలుస్తున్నారు. భోగి(సర్పం)చేత పూజింపబడుతున్న శివలింగముంది కనుక భోగే శ్వరాలయమని చెప్పడం కట్టుకథ. శాసనంలో ఉన్న పేరు వేరే. రామప్పలో కూడా రుద్రేశ్వరుడని శాస నంలో ఉన్నా రామలింగేశ్వరుడని పిలుస్తున్నారు. శాసనాల ఆధారంగా పేర్లను మార్చితే చరిత్ర కూడా గుర్తుంటుంది.

ఈ గుడిలో ఉన్న మూడు శివలింగాల లో రెండు బాణలింగాలు.(నర్మదానదివంటి నదులలో ఏరి తెచ్చిన గుండ్రని, అండాకారపు రాళ్ళు. వాటిని బాణమని పిలుస్తారు. వాటిని ప్రతిష్టిస్తే అవి బాణ లింగాలు). ఒక సమతల శీర్షోపరితలంతో సమలింగం ఉన్నాయి. వాటి వెనక ప్రతిష్టితమైన శిల్పం సోమనాథునిది.

గర్భాలయానికి ఉన్న శైవద్వారపా లకులు. చతుర్భుజులు. వారిద్దరికి ఇద్దరిద్దరు చామరధారి ణులున్నారు. దేవాలయ మంటపంలోని స్తంభాలు పునరు ద్ధరణ కొత్తగా నిలిపినవి. అవి కాకతీయశైలి స్తంభాలు కావు. గుడిబయట చెట్టు కింద ఒక సతిశిల  వుంది.వీరుడు మరణిస్తే అతనితోపాటు ప్రాణాలువదిలిన స్త్రీ శిల్పాలు. ఆ శిలమీద సూర్య,చంద్రులు కింద చెక్కివున్నాయి. వారి కీర్తి ఆచంద్రార్కం వుండాలని సంకేతం.

శ్రీరామోజు హరగోపాల్, కన్వీనర్, కొత్త తెలంగాణ చరిత్రబృందం 

99494 98698

మరిన్ని వార్తలు