6 September, 2026 | 1:38 PM

కేసీఆర్ రాజీనామా డిమాండ్.. డైవర్షన్‌లో భాగమే

06-09-2026 | 12:23pm

హైదరాబాద్: మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(Kalvakuntla Chandrashekar Rao) రాజీనామా చేయాలని కోరడం డైవర్షన్‌లో భాగమేనని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు(Siddipet MLA Harish Rao) ఆరోపించారు. ఈ చిల్లర చేష్టలతో ప్రజల దృష్టిని మరల్చలేరని ఆగ్రహం వ్యక్తం చేశారు. కబ్జా చేయడానికి సిద్దిపేటలో దండయాత్ర చేస్తారా?.. గతంలో రెండుసార్లు సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సిద్దిపేటకు వచ్చి ఏం చేశారు? అని హరీశ్ రావు ప్రశ్నించారు. తెలంగాణ అసెంబ్లీలో 22ఏపై పోరాటం చేస్తామని హరీష్ రావు తేల్చిచెప్పారు.

ఇందిరా పార్కు వద్ద టీపీసీసీ ఆధ్వర్యంలో ధర్నా

ఇందిరా పార్కు ధర్నా చౌక్ వద్ద టీపీసీసీ(Telangana Pradesh Congress) ఆధ్వర్యంలో కాంగ్రెస్ ధర్నా ప్రారంభించింది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. ధర్నా కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబు(Minister Sridhar Babu), పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారు వి. హనుమంతరావు, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, ఎమ్మెల్యేలు శంకర్, గణేష్, ఎమ్మెల్సీ సారయ్య తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు