లారీ ఢీకొని ఏడో తరగతి విద్యార్థి అక్కడికక్కడే మృతి
స్నేహితుడితో ద్విచక్రవాహనంపై వెళ్తుండగా లారీ ఢీ..
విషాదంలో కుటుంబం
కోదాడ నవంబర్ 24 (విజయక్రాంతి): మండలం అడ్లూరు గ్రామ శివారులో జరిగిన రోడ్డు ప్రమాదం(Road Accident)లో ఏడో తరగతి విద్యార్థి షేక్ నాగుల్(14) మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మంగళవారం కార్తీక పౌర్ణమి పాఠశాల సెలవు దినం కావడంతో పాత గుడిబండ గ్రామానికి చెందిన నాగుల్ తన స్నేహితుడు గౌతమ్ తో కలిసి తొగర్రాయి నుంచి పాత గుడిబండకు ద్విచక్రవాహనంపై వెళ్తుండగా, కోదాడ నుంచి మేళ్లచెరువు వైపు వెళ్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నాగుల్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.