కొనుగోలు కేంద్రాలలో ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలి...

24-11-2026 | 06:53pm

తాడ్వాయి, నవంబర్ 24 (విజయక్రాంతి): వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని డిసిఓ రామ్మోహన్(DCO Rammohan) తెలిపారు. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం కృష్ణాజివాడి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... సోమవారం ఓ రైతుకు కలిగిన ఇబ్బందులు మరోసారి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు.

సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతులు తీసుకువచ్చిన ధాన్యాన్ని వెంట వెంటనే తూకం వేసి గోదాంకు తరలించే ఏర్పాట్లు చేయాలన్నారు. గోదాం నిర్వాహకులు ఏమైనా ఇబ్బందులు కలిగిస్తే తన దృష్టికి తీసుకురావాలని సిబ్బందికి సూచించారు. ఆయన వెంట క్లస్టర్ అధికారి నగేష్, వ్యవసాయ శాఖ అధికారి నర్సింలు, సీఈఓ నర్సింలు, సిబ్బంది ఏనుగు నితేష్ రెడ్డి,శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు