విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి

24-11-2026 | 06:26pm

కొండపాక, నవంబర్ 24 (విజయక్రాంతి): కార్తీక పౌర్ణమి పండుగ వేళ విద్యుత్ షాక్‌(Electric Shock)తో ఓ వ్యక్తి మృతి చెందిన విషాద సంఘటన కొండపాక మండలం బందారం గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రాగుల దుర్గయ్య పండుగ సందర్భంగా పెద్దమ్మ దేవాలయాన్ని శుభ్రం చేసి దీపారాధన నిర్వహించాడు. అనంతరం మైక్‌లో ప్రకటన చేసేందుకు మౌత్‌పీస్ పట్టుకోగా విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. పండుగ పూట జరిగిన ఈ ఘటనతో బందారం గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. దుర్గయ్య మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

మరిన్ని వార్తలు