విద్యార్థి దశలోనే వారిలో ఉన్న ప్రతిభను తల్లిదండ్రులు గుర్తించి ప్రోత్సహించారు

24-11-2026 | 06:39pm

ఘట్ కేసర్, నవంబర్ 24 (విజయక్రాంతి): విద్యార్థులను చిన్నతనంలో వారిలో ఉన్న ప్రతిభను తల్లిదండ్రులు గుర్తించి ఆ దిశగా వారిని ప్రోత్సహించాలని పోచారం డివిజన్ బిఆర్ఎస్ సీనియర్ నాయకులు నర్రి కాశయ్య(BRS leader Narri Kashayya) అన్నారు. పోచారం డివిజన్ పరిధిలోని యంనంపేట్ బాక్స్ క్రికెట్ మైదానంలో థాయికాండో బెల్టు ప్రమోషన్ టెస్ట్ ననావత్  పవన్, శివ కుమార్ మాస్టారు ఆధ్వర్యంలో మంగళవారం జరిగింది. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు నర్రి కాశయ్య, బద్దం జగన్మోహన్ రెడ్డి, నల్లవెల్లి శేఖర్ ముదిరాజ్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కాశయ్య మాట్లాడుతూ విద్యార్థులను చిన్నతనంలోనే వారిలో ఉన్న క్రీడా ప్రతిభను తల్లిదండ్రులు గుర్తించి ప్రోత్సహించాలన్నారు. క్రీడల వల్ల దేహదారుఢ్యం, మానసిక ప్రశాంతత లభిస్తాయని తెలిపారు. క్రీడల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థినీ, విద్యార్థులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు లభించే అవకాశం తప్పక ఉంటుందని ఆయన తల్లిదండ్రులకు సూచించారు. అనంతరం విద్యార్థులకు గుర్తింపు పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సైనికుడు నాయుడు, భాషగోని సౌజన్య, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు