ట్రైనీ ఐపీఎస్ కేసులో ట్విస్ట్.. ఏ2గా సోదరుడు
హైదరాబాద్: ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి(Trainee IPS officer Uday Krishna Reddy) కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఆయన సోదరుడు ప్రణయ్ కృష్ణారెడ్డిని పోలీసులు రెండో నిందితుడిగా (ఏ2) చేర్చారు. కేసుకు సంబంధించిన కీలక ఆధారాలను దాచిపెట్టడంలో ఆయన పాత్ర ఉన్నట్లు దర్యాప్తు అధికారులు గుర్తించినట్లు సమాచారం.
విచారణలో ఉదయ్‌కు సంబంధించిన మొబైల్ ఫోన్‌ను ప్రణయ్ దాచినట్లు పోలీసులు గుర్తించారు. అలాగే ఉదయ్ గతంలో ఆత్మహత్యాయత్నం చేసిన సమయంలో రాసిన సూసైడ్ నోట్‌ను కూడా ఆయన వద్ద ఉంచినట్లు దర్యాప్తులో వెల్లడైనట్లు వార్తా కథనాలు పేర్కొన్నాయి. ఈ పరిణామాలతో ప్రణయ్‌ను కేసులో మరో నిందితుడిగా చేర్చారు.
హైదరాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీసు అకాడమీ(Sardar Vallabhbhai Patel National Police Academy)లో శిక్షణ పొందుతున్న మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారి(Female trainee IPS officer) ఫిర్యాదు మేరకు ఉదయ్ కృష్ణారెడ్డిపై అత్తాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. లైంగిక వేధింపులు(Sexual Harassment), ఇతర ఆరోపణల నేపథ్యంలో ఆయనను అరెస్టు చేశారు. ఈ కేసు అప్పట్లో తీవ్ర చర్చనీయాంశమైంది. తాజా పరిణామంతో కేసు దర్యాప్తు మరింత కీలకంగా మారింది. మరోవైపు తన అరెస్టును నివారించేందుకు ప్రణయ్ ముందస్తు బెయిల్ పొందినట్లు సమాచారం. పోలీసుల తదుపరి విచారణలో మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.