అంగరంగ వైభవంగా కార్తీక పౌర్ణమి ఉత్సవాలు....

24-11-2026 | 06:37pm

పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు...

తాడ్వాయి,నవంబర్, 24( విజయ క్రాంతి ): కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా మంగళవారం కార్తీక పౌర్ణమి ఉత్సవాలు(Kartika Purnima Celebrations) అంగరంగ వైభవంగా జరిగాయి.మండల కేంద్రంలోని శ్రీ శబరిమాత ఆశ్రమంలో ఉదయం నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఎల్లారెడ్డి ఎమ్మెల్యే కే మదన్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బ్రహ్మాజీ వాడి శివారులోని శ్రీ సిద్దేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.బిజెపి రాష్ట్ర నాయకుడు, ప్రముఖ సైంటిస్ట్ పైడి ఎల్లారెడ్డి శ్రీ సిద్దేశ్వర స్వామి ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అంతకుముందు మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ శ్రీ సిద్దేశ్వర స్వామి ఉత్సవాల్లో పాల్గొని పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు మాట్లాడుతూ... సిద్దేశ్వర స్వామి ఆలయానికి వెళ్లడం కోసం కోసం భక్తులకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయని సీసీ రోడ్డు నిర్మాణం కోసం ప్రత్యేక నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు.దీంతో ఆలయానికి రోడ్డు మార్గం మెరుగైందన్నారు.

ఆలయ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.ఎమ్మెల్యేగా గెలుపొందగానే తాను ప్రత్యేకంగా ఆలయాల అభివృద్ధి కోసం ప్రత్యేక నిధులు తీసుకువచ్చి అభివృద్ధి చేయిస్తున్నానని తెలిపారు.కార్తీక పౌర్ణమి సందర్భంగా శ్రీ సిద్దేశ్వర స్వామి ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఆలయం ఆవరణలో అత్యంత భక్తిశ్రద్ధలతో గ్రామస్తులు యజ్ఞం కార్యక్రమం నిర్వహించారు. మండలంలోని వివిధ గ్రామాల నుంచి భక్తులు తరలివచ్చి పూజలు చేశారు. లింగంపేట, కామారెడ్డి, గాంధారి, బిక్కనూరు, ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట మండలం నుంచి భక్తులు తరలివచ్చారు.

భక్తులకు ప్రత్యేక అన్నదానం...

శ్రీ సిద్దేశ్వర స్వామి ఉత్సవాల్లో పాల్గొన్న భక్తులకు ప్రముఖ సైంటిస్ట్ పైడ్ ఎల్లారెడ్డి ఆధ్వర్యంలో గ్రామస్తుల సహకారంతో ప్రత్యేక అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. భక్తులందరికీ అన్నదానం నిర్వహించారు. ఉత్సవాల్లో పాల్గొన్న భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ కమిటీ నిర్వాహకులు అన్ని ఏర్పాటు చేశారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బండారు సంజీవులు, గ్రామ సర్పంచ్ అంజనీ భాయిరఘుపతిరావు, ఉప సర్పంచ్ రాజు యాదవ్,నాయకులు మద్ది మహేందర్ రెడ్డి, అంబీర్ శ్యామ్ రావు, జూకంటి వెంకట్ రెడ్డి, పైడి రాజేశ్వర్ రెడ్డి, ప్రసాద్ రావు, రాజా గౌడ్,మేకల రాజు, సంకు పోచయ్య, గైని శివాజీ,షౌకత్ అలీ, అశోక్ రావు,రవీందర్ రావు, బలవంతరావు, రాజేందర్ రావు, కూరెల్లి నరసింహులు,  పెద్దగొళ్ల సాయిలు, రాములు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు