పార్టీ బలోపేతంలో బిఎల్ఏలదే కీలక పాత్ర...
చెన్నూర్,( విజయక్రాంతి):బూతు స్థాయిలో పార్టీ బలోపేతంలో బిఎల్ఏ లదే కీలక పాత్ర అని మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పిన్నింటి రఘునాథ్ రెడ్డి ,చెన్నూర్ నియోజకవర్గ సర్(Chennur Constituency Sir) (SIR) ఇంచార్జ్ శ్రీ కోట్య నాయక్ అన్నారు.
చెన్నూర్ టౌన్ ప్రెసిడెంట్ లింగంపల్లి మహేష్ అధ్యక్షతన మంగళవారం చెన్నూర్ లో నిర్వహించిన బిఎల్ఏల ఫేస్ 3 సమీక్ష సమావేశానికి జిల్లా అధ్యక్షుడు రఘునాథరెడ్డి తో కలిసి హాజరైన శ్రీ కోట్య నాయక్ మాట్లాడారు.కాంగ్రెస్ పార్టీ బలోపేతం, ఓటరు నమోదు ఎన్నికల విధివిధానాలపై బిఎల్ఏ లకు కీలక సూచనలు, దిశానిర్దేశం చేశారు. పార్టీకి బూత్ లెవెల్ ఏజెంట్లే వెన్నుముకని, ప్రతి బూత్ పరిధిలో పార్టీని పటిష్టం చేయడంలో బిఎల్ఏలదే ప్రత్యేక పాత్ర ,అత్యంత కీలకమన్నారు.
పార్టీ మీకు అప్పగించిన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో మంచిర్యాల జిల్లా జనరల్ సెక్రటరీ & చెన్నూర్ బ్లాక్ ఇంఛార్జ్ పుల్లూరి లక్ష్మణ్ ,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు కుర్మ రాజమల్లా గౌడ్, జిల్లా జనరల్ సెక్రెటరీ కొండు వెంకటేష్ , కోటపల్లి మండల అధ్యక్షుడు కాట్రాళ్ల మల్లయ్య , ఆయా గ్రామాల సర్పంచులు, కౌన్సిలర్లు, కోఆప్షన్ మెంబర్లు, బిఎల్ఏలు,నాయకులు పాల్గొన్నారు