ఏఐసీసీ తెలంగాణ ఇన్‌చార్జిని కలిసిన డీసీసీ అధ్యక్షురాలు

24-11-2026 | 06:33pm

మహబూబాబాద్: హైదరాబాద్‌ గాంధీభవన్‌లో ఏఐసీసీ తెలంగాణ ఇన్‌చార్జి సందీప్ జీని మహబూబాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షురాలు డాక్టర్ ఉమా మురళి నాయక్(DCC President Dr Uma Murali Naik) మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సందీప్ జీని శాలువాతో సత్కరించారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతం, జిల్లాలో పార్టీ కార్యక్రమాలు, ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలను మరింత చేరువ చేయడం వంటి అంశాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు.

మరిన్ని వార్తలు