రెస్టారెంట్, హోటల్ పై ఆహార పరిరక్షణ విభాగం దాడులు
సోమేశ్వర ఫ్యామిలీ రెస్టారెంట్ సీజ్, చెర్రీ ఫ్యామిలీ రెస్టారెంట్ పై పదివేలు జరిమానా విధించిన అధికారులు.
పరిశుభ్రతను పాటించకుంటే కేసులు నమోదు చేస్తాం.
తుంగతుర్తి (విజయక్రాంతి): ఆహార భద్రత మరియు పరిశుభ్రతపై అవగాహన కల్పించడానికి చక్రాలపై ఆహార భద్రత (Food Safety on Wheels) అనే మొబైల్ ల్యాబ్ ద్వారా ఆహార పదార్థాలను పరీక్షించి కల్తీని నిరోధించడంలో చక్రాలపై ఆహార భద్రత సహాయపడుతుంది, అలాగే ప్రజలకు ఆహార భద్రత గురించి అవగాహన కల్పించడానికి, సురక్షితమైన ఆహార పద్ధతులను ప్రోత్సహించడానికి కూడా ఉపయోగపడుతుంది.
ఆహార పరిరక్షణ మరియు ప్రమాణాల ప్రాముఖ్యతను ప్రజల్లో పెంపొందించాలనే లక్ష్యంతో, తిరుమలగిరిలో ఉన్న ఆహార వ్యాపార స్థావరాలపై తనిఖీ నిర్వహించబడింది. ఈ తనిఖీల్లో శ్రీ సోమేశ్వర ఫ్యామిలీ రెస్టారెంట్, చెర్రీ బార్ అండ్ రెస్టారెంట్ డాబా మరియు సునీత రెస్టారెంట్ బార్ మరియు సురభి హోటల్ . తనిఖీలో భాగంగా అపరిశుభ్రత కారణాలవల్ల శ్రీ సోమేశ్వర ఫ్యామిలీ రెస్టారెంట్ ను సీజ్ చేయడం జరిగింది మరియు చెర్రీ ఫ్యామిలీ రెస్టారెంట్ పై పదివేల జరిమానా విధించడం జరిగింది.
సురభి హోటల్లో 2000 రూపాయలు జరిమాను విధించడం జరిగింది. సునీత రెస్టారెంట్ పై రెండు వేల జరిమానా విధించడం జరిగింది. ఆహార విక్రయ కేంద్రాల్లో నమూనాలు సేకరించబడ్డాయి. డ్రైవ్‌లో ఫుడ్ సేఫ్టీ ఆన్ వీల్స్ (FSW) మొబైల్ ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్‌ను ఉపయోగించి తక్షణ పరీక్షలు నిర్వహించబడ్డాయి. ఈ తనిఖీలలో పాల్గొన్న సిబ్బంది ఫుడ్ సేఫ్టీ సిబ్బంది ఆ పూరపాలక తిరుమలగిరి సిబ్బంది.
తనిఖీల్లో గుర్తించబడిన అంశాలు:
టి పౌడర్‌కు ఫిల్టర్ పేపర్ స్పాట్ టెస్ట్, నూనెను టీ.పి.సి మీటర్ టెస్టు నిర్వహించగా, కొన్ని నమూనాల్లో ఆహార పరిరక్షణ ప్రమాణాల లోపాలు ఉన్నట్లు గుర్తించబడింది. వాటిని వెంటనే స్వాధీనం చేసుకుని వ్యాపారస్థుల సమక్షంలో ధ్వంసం చేయించబడ్డాయి.
దీనిపై సంబంధిత వ్యాపారస్థులను విచారించగా అవగాహనా లోపంతో వాడుతున్నట్లు గుర్తించి వారికీ నోటీసులు జారీ చేసి, కల్తీ పదార్థాల వాడకంపై అవగాహన కల్పించబడింది.ఆహార పరిరక్షణ ప్రమాణాలను నిర్లక్ష్యం చేస్తే ప్రజల ఆరోగ్యానికి హానికలిగించే ప్రమాదం ఉన్నదని అధికారులు హెచ్చరించారు. దీర్ఘకాలిక వినియోగం వల్ల క్యాన్సర్ వంటి వ్యాధులకు దారితీయవచ్చని ప్రజలకు వివరించారు.
జిల్లా ఆహార పరిరక్షణ విభాగం, కల్తీ ఆహార పదార్థాలు ప్రజారోగ్యానికి ముప్పుగా మారే అవకాశం ఉండటంతో, వ్యాపారులు నిబంధనలు పాటించాలని అవగాహనా కల్పించారు. ప్రజలు కూడా అనుమానాస్పదమైన ఆహార ఉత్పత్తులపై జిల్లా ఆహార పరిరక్షణ శాఖకు సమాచారం అందించాలని అధికారులు కోరారు.