చిదిమేసిన చీకటి ప్రయాణం
- - బైక్ ను ఢీ కొట్టిన గుర్తుతెలియని వెహికల్.
- - చేవెళ్ల మండలం గొల్లపల్లిలో ఘటన.
- - ప్రమాదంలో భార్య భర్తలు సహా కొడుకు మృత్తి కూతురుకు గాయాలు
- - మృతదేహాల చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు
చేవెళ్ళ అక్టోబర్ 06(విజయక్రాంతి): ఆ కుటుంబానికి ఆత్మబంధువులను నుంచి ఫంక్షన్కు తప్పకుండ రావాలని కబురొచ్చింది. పిల్లలు స్కూల్ ముగించుకొని ఇంటికి రాగానే బంధువుల ఫంక్షన్ కు హాజరవ్వాలని ఆ కుటుంబం బయలుదేరింది. అంత సేపు బంధువులతో హ్యాపీగా గడిపారు. అదే రాత్రి తెలుగు ప్రయాణంకు సిద్ధమైన కుటుంబాన్ని పొద్దున పోదునని బంధువులు వారించారు.
పిల్లలు పొద్దున్న స్కూలుకు వెళ్లాలని అదే రాత్రి తిరుగు ప్రయాణమైందా కుటుంబం. అంతలోనే చేవెళ్ల మండలంలోని గొల్లపల్లి గ్రామంలో మంగళవారం రాత్రి 10గంటల ప్రాంతంలో గుర్తుతెలియని వెహికల్ ఢీకొని భార్య భర్త కుమారునితో సహా ముగ్గురు స్పాట్లోనే చనిపోయారు.
మొయినాబాద్(Moinabad) గ్రామానికి పరిధిలోని మేడిపల్లి గ్రామానికి చెందిన కుమ్మరి మధు, సావిత్రి దంపతులు కూతురు అక్షిత కొడుకుతో కలిసి చేవెళ్ల మండల పరిధిలోని చన్వెల్లి గ్రామానికి చెందిన కుమ్మరి వెంకటేష్ కూతురు మెచ్యూరిటీ ఫంక్షన్ కు కుటుంబ సమేతంగా హాజరయ్యారు. ఫంక్షన్ ముగిసిన అనంతరం తిరిగి ప్రయాణంలో గొల్లపల్లి గేటు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో దంపతులు మధు సావిత్రి కుమారుడు మరణించగా కూతురు అక్షిత గాయాలతో బయటపడింది. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతులను చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి గాయపడి అక్షితకు చికిత్స అందిస్తున్నారు.