జె.ఆర్. హైస్కూల్‌ విద్యార్థుల అథ్లెటిక్స్‌ సత్తా

06-10-2026 | 11:45pm

స్వర్ణంతో మెరిసిన నవ్యశ్రీ రాష్ట్రస్థాయి క్రీడలకు ఎంపిక

రాష్ట్రస్థాయి క్రీడలకు ఎంపిక

రిషీంద్ర పటేల్‌కు రజతం

వేద సిద్ధార్థ్‌కు కాంస్యం

కన్నాయిగూడెం, అక్టోబరు 6 (విజయక్రాంతి): అథ్లెటిక్స్‌ పోటీల్లో జె.ఆర్. హైస్కూల్‌ ఏటూరునాగారం విద్యార్థులు సత్తాచాటారు. పాఠశాలకు చెందిన నాలుగో తరగతి విద్యార్థిని నవ్యశ్రీ(Navyashree) స్వర్ణ పతకం సాధించి, రాబోయే సబ్‌జూనియర్స్‌ అథ్లెటిక్స్‌ మీట్‌కు ఎంపికైంది. అంతేకాకుండా రాష్ట్రస్థాయి క్రీడలకు కూడా నవ్యశ్రీ ఎంపిక కావడం విశేషం.

అదేవిధంగా ఏడో తరగతి విద్యార్థి రిషీంద్ర పటేల్ రజత పతకం, అదే తరగతికి చెందిన వేద సిద్ధార్థ్ కాంస్య పతకం సాధించారు. ఒకేసారి ముగ్గురు విద్యార్థులు పతకాలు సాధించడంతో పాఠశాలలో ఆనందం నెలకొంది.

విద్యార్థుల విజయాల పట్ల జె.ఆర్. హైస్కూల్‌ యాజమాన్యం, ఉపాధ్యాయులు అభినందనలు తెలిపారు. రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన నవ్యశ్రీ మరింత ప్రతిభ కనబరిచి పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.

మరిన్ని వార్తలు