పౌరాణిక యక్షగాన నటుడు సీనియర్ చిన్న చెన్నప్పకు నివాళి

06-10-2026 | 11:58pm

గండీడ్ (విజయక్రాంతి): మండల పరిధిలోని మన్సూర్‌పల్లి గ్రామానికి చెందిన ప్రముఖ పౌరాణిక యక్షగాన కళాకారుడు ఎదుల చిన్న చెన్నప్ప(Chinna Chennappa)(82)కు ఆయన శిష్యులు, భజన మండలి సభ్యులు ఘనంగా నివాళులు అర్పించారు. చిన్న చెన్నప్పకు అచల గురుడై స్వర్గస్తులై 41వ రోజు సందర్భంగా మన్సూర్‌పల్లి శ్రీ భక్త ఆంజనేయ భజన మండలి, రెడ్డిపల్లి గ్రామ శ్రీ విఘ్నేశ్వర భజన మండలి సభ్యులు కలిసి అఖండ భజన కార్యక్రమాన్ని నిర్వహించారు.

భక్తిశ్రద్ధలతో శ్రీరామ భజన కీర్తనలు ఆలపిస్తూ,పౌరాణిక యక్షగాన కళారంగానికి సేవలందించిన చిన్న చెన్నప్పను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన శిష్యులైన భజన బృందం సభ్యులు మాట్లాడుతూ.చిన్న చెన్నప్ప పౌరాణిక కళను ఎంతో భక్తిశ్రద్ధలతో ఆచరించడంతో పాటు,పలువురికి కళలో శిక్షణ అందించారని గుర్తుచేశారు. ఆయన సేవలను స్మరించుకుంటూ అఖండ భజన నిర్వహించారు.

మరిన్ని వార్తలు