సాగునీటి కోసం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలిసిన ప్రభుత్వ విప్ విజయరమణ రావు
పెద్దపల్లి జిల్లా రైతాంగానికి సాగునీరు అందించాలని విజ్ఞప్తి
హైదరాబాద్, అక్టోబర్ 6 (విజయక్రాంతి): పెద్దపల్లి నియోజకవర్గ రైతాంగానికి సాగునీరు అందించేలా చర్యలు చేపట్టాలని కోరుతూ ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Minister Uttam Kumar Reddy)ని కలిశారు. మంగళవారం హైదరాబాద్‌లో జిల్లా మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు నేతృత్వంలో మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసి జిల్లాలో సాగునీటి అవసరాలు, రైతుల సమస్యలను వివరించారు.
రైతాంగానికి సాగునీరు అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కోరినట్లు విజయరమణ రావు తెలిపారు. ఈ కార్యక్రమంలో రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ పాల్గొన్నారు.