మల్లన్న గండి రిజర్వాయర్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మృతదేహం లభ్యం
06-10-2026 | 11:43pm
జనగామ, అక్టోబర్ 06 (విజయక్రాంతి): మల్లన్న గండి రిజర్వాయర్(Mallanna Gandi Reservoir)లో ఆదివారం గల్లంతైన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మృతదేహం ఈరోజు ఉదయం లభ్యమైంది. గల్లంతైన ఉద్యోగి కోసం ఫైర్ సిబ్బంది, పోలీసులు గజ ఈతగాళ్లతో 2 రోజులుగా గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో ఈరోజు ఉదయం రిజర్వాయర్‌లో మృతదేహం లభించింది. సహాయక సిబ్బంది మృతదేహాన్ని ఒడ్డుకు చేర్చారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని జనగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించనున్నట్లు పోలీసులు తెలిపారు.