బూర్గూడెంలో పోలీసుల కార్డెన్ సెర్చ్
పలిమెల అక్టోబర్ 6 (విజయక్రాంతి): పలిమెల మండలంలోని బూర్గూడెంలో కాటారం డిఎస్పి సూర్యనారాయణ ఆధ్వర్యంలో పోలీసుల కార్డెన్ సెర్చ్(Cordone Search) నిర్వహించారు. గ్రామంలోని ప్రతి ఇంటిని క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. గ్రామంలో గుడుంబా తయారీ క్రయవిక్రయాలపై ఆరా తీశారు. గంజాయి వంటి మారక ద్రవ్యాల అక్రమ నిల్వలు ఉన్నాయనే అనుమానంతో ప్రతి ఇల్లు పరిసరప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. గ్రామంలో వాహనాలను తనిఖీ చేసి సరియైన పత్రాలు లేని వాహనాలకు జరిమానా విధించారు.
వాహనదారులకు లైసెన్స్ తో పాటు వాహన పత్రాలు కలిగి ఉండాలని ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని పోలీసులను సూచించారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండి చెడు వ్యసనాలకు లోను కాకుండా విద్య క్రీడలతో పాటు ఉపాధి అవకాశాల వైపు దృష్టి సారించాలని డిఎస్పి సూర్యనారాయణ యువతకు సూచించారు.
ఈ నెల 9న భూపాల్ పల్లిలో నిర్వహించనున్న జాబ్ మేళాలో అర్హులైన యువత పాల్గొని ఉద్యోగ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.పోలీస్ కానిస్టేబుల్ ఎస్సై ఉద్యోగులకు సన్నద్ధమవుతున్న యువతకు భూపాలపల్లి జిల్లా ఎస్పీ కార్యాలయంలో నిర్వహించే శిక్షణా కార్యక్రమంలో పాల్గొనడానికి ఆసక్తి ఉన్న వారికి అవసరమైన సహకారం అందిస్తామని డిఎస్పీ తెలిపారు. ఈ కార్యక్రమంలో మహాదేవపూర్ సిఐ ఎన్ వెంకటేశ్వర్లు మహాదేవపూర్ ఎస్సై సాంబమూర్తి పలిమెల ఎస్సై టి సాయి శశాంక్ పోలీస్ సిబ్బంది ప్రజలు పాల్గొన్నారు.