అప్పుల బాధతో వ్యక్తి అదృశ్యం

06-10-2026 | 11:49pm

హన్వాడ: మండలం పరిధిలోని అమ్మటోనిపల్లి గ్రామానికి చెందిన కంఠం తిరుపతయ్య (32) అప్పుల బాధతో అదృశ్యమైన ఘటన సోమవారం చోటుచేసుకుంది. ఈ నెల 5న ఉదయం 11 గంటలకు మహబూబ్‌నగర్ వెళ్లి వస్తానని భార్యకు చెప్పి ఇంటి నుంచి వెళ్లిన తిరుపతయ్య తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు.

ఇంట్లో వెతకగా ఆయన రాసిన లేఖ లభించింది. అప్పులు ఎక్కువయ్యాయని, వాటిని తీర్చేందుకు వెళ్లుతున్నట్లు లేఖలో పేర్కొన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో భార్య కంఠం సంతోష హన్వాడ(Hanwada mandal) పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్‌ఐ వెంకటేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తిరుపతయ్యకు ఇద్దరు పిల్లలు ఉన్నారు.

మరిన్ని వార్తలు