గ్రామీణ యువతకు స్వయం ఉపాధిపై నాబార్డ్ అవగాహన

27-11-2026 | 07:47pm

గడ్డిపల్లి కేవీకేలో నేషన్‌వైడ్ గ్రామ్ యువశక్తి క్యాంపెయిన్–2026

గరిడేపల్లి, నవంబర్ 27 (విజయక్రాంతి): గ్రామీణ యువతలో స్వయం ఉపాధి(Self-employment) అవకాశాలను పెంపొందించి, వ్యవసాయ ఆధారిత పారిశ్రామిక రంగాల(Industrial sectors) వైపు ప్రోత్సహించడమే లక్ష్యంగా నాబార్డ్ ఆధ్వర్యంలో నేషన్‌వైడ్ గ్రామ్ యువశక్తి క్యాంపెయిన్ (ఎన్.జి.వై.ఎస్.సి)–2026 కార్యక్రమంలో భాగంగా గడ్డిపల్లి కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే)లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా నాబార్డ్ జిల్లా అభివృద్ధి అధికారి (డీడీఎం) రవీందర్ నాయక్ మాట్లాడుతూ.. వ్యవసాయ రంగంలో యువతకు అనేక ఉపాధి, స్వయం ఉపాధి అవకాశాలు ఉన్నాయని తెలిపారు. యువత తమ నైపుణ్యాలను అభివృద్ధి చేసుకొని వ్యవసాయాన్ని లాభదాయకమైన వ్యాపారంగా మలుచుకోవాలని సూచించారు.

వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు, పశుపోషణ, పాడి పరిశ్రమ, ఆహార శుద్ధి, వ్యవసాయ యాంత్రీకరణ, విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీ వంటి రంగాల్లో యువతకు ఉన్న అవకాశాలను వివరించారు. వివిధ ప్రభుత్వ ఆర్థిక సహాయ పథకాలు, బ్యాంకు రుణ సదుపాయాలు, స్వయం ఉపాధి కార్యక్రమాలపై అవగాహన కల్పించారు.

ఈ కార్యక్రమంలో ఆసక్తి ఉన్న గ్రామీణ యువతను గుర్తించి, స్వయం ఉపాధి కార్యక్రమాల్లో భాగస్వాములను చేసేందుకు నమోదు ప్రక్రియ చేపట్టారు. గ్రామీణ ప్రాంతాల్లో యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం, వ్యవసాయ రంగంలో నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించడం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడమే ఈ క్యాంపెయిన్ ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో నాబార్డ్ డీడీఎం రవీందర్ నాయక్, కేవీకే వ్యవసాయ శాస్త్రవేత్తలు డి. నరేష్, సి.హెచ్. నరేష్, కిరణ్, సుగంధి, అక్షిత సాయి, లీడ్ బ్యాంక్ మేనేజర్ నాగప్రసాద్, వ్యవసాయ శాఖ రిటైర్డ్ డిప్యూటీ డైరెక్టర్ హుస్సేన్ బాబు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు