మెడికల్ కళాశాలకు పార్థివ దేహం అందజేత

27-11-2026 | 07:36pm

వరంగల్: వరంగల్ నగరంలోని(Warangal City) కాశీబుగ్గ నివాసి మాటేటి సురేందర్(Mateeti Surender) (61) ఒక వ్రృద్డాశ్రమంలో(Old Age Home) నివసిస్తూ అనారోగ్యంతో(Illness) శుక్రవారం మరణించాడు. సురేందర్ సోదరీమణులు రమ, సునిత సహకారంతో సమాజ హితం కోరి, వైద్య విద్య నిమిత్తం, మెడికల్ కాలేజీ కి సురేందర్ పార్దివ దేహదానం చేయుటకు అంగీకరించారు. తెలంగాణ నేత్ర అవయవ శరీర దాతల అసోసియేషన్(Telangana Association of Eye, Organ, and Body Donors) ఆధ్వర్యంలో ప్రత్యేక అంబులెన్స్ లో దేహాన్ని కాకతీయ మెడికల్ కాలేజీ(Kakatiya Medical College) అనాటమీ విభాగానికి తెచ్చి అప్పగించారు.

ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ డాక్టర్ మోహన్ దాస్, అనాటమీ విభాగపతి డాక్టర్ శశికాంత, డాక్టర్ మాధవి, అనాటమీ సిబ్బంది ప్రేమ్ కుమార్, యాదగిరి, ప్రణవ్, తెలంగాణ నేత్ర శరీర అవయవ దాతల అసోసియేషన్(TEOBDA) వరంగల్ జిల్లా అధ్యక్షులు  కోన్ రెడ్డి మల్లారెడ్డి, సలహాదారు సోమ మధూకర్ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు