ఓడిపోయిన నేతలకు ప్రభుత్వ కార్యక్రమాల్లో ఏం పని?

27-11-2026 | 05:58pm

హైదరాబాద్: తెలంగాణలో ప్రభుత్వ కార్యక్రమాల నిర్వహణపై కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య ప్రోటోకాల్ వివాదం(Protocol Violations) మరోసారి తెరపైకి వచ్చింది. గత మూడేళ్లుగా ప్రతిపక్ష ఎమ్మెల్యేల హక్కులను ఉల్లంఘిస్తున్నారని బీఆర్ఎస్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి(BRS MLA Sabitha Indra Reddy) ఆరోపించారు. ఈ అంశంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్)కు ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు.

సచివాలయం వద్ద మీడియాతో మాట్లాడిన ఆమె.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అండతో ఎన్నికల్లో ఓటమి చెందిన కాంగ్రెస్ నాయకులు ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని విమర్శించారు. ప్రజలు ఎన్నుకున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు దక్కాల్సిన ప్రాధాన్యతను తగ్గిస్తున్నారని ఆరోపించారు.

చెక్కుల పంపిణీ, అభివృద్ధి పనులు, శంకుస్థాపన వంటి కార్యక్రమాల్లో ప్రోటోకాల్ నిబంధనలను యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారని సబిత పేర్కొన్నారు. అధికార పార్టీ నాయకులకు అనుకూలంగా వ్యవహరిస్తూ ప్రతిపక్ష ప్రజాప్రతినిధుల హక్కులను కాలరాస్తున్నారని మండిపడ్డారు.

ఈ పరిస్థితిపై పలుమార్లు అభ్యంతరం తెలిపినా మార్పు రాలేదని, అందుకే తాజాగా సీఎస్‌ను కలిసి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులకు నిబంధనల ప్రకారం గౌరవం కల్పించాలని ఆమె డిమాండ్ చేశారు.

మరిన్ని వార్తలు