సమయపాలన తప్పితే చర్యలు తప్పవు

27-11-2026 | 07:33pm

30 మంది టీచర్లకు డీఈవో  నోటీసులు

నర్సంపేట, నవంబర్ 27( విజయ క్రాంతి ):విధి నిర్వహణలో సమయపాలన పాటించని 30 మంది ఉపాధ్యాయులకు వరంగల్ జిల్లా విద్యాశాఖాధికారి(District Educational Officer, Warangal District) (డీఈవో) ఎన్. ప్రశాంత్‌రెడ్డి శుక్రవారం షోకాజ్ నోటీసులు జారీ చేశారు.

దుగ్గొండి మండల పరిధిలోని వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న పలువురు ఉపాధ్యాయులు ముఖ హాజరు గుర్తింపు (ఎఫ్‌ఆర్‌ఎస్‌) యాప్‌లో నిర్ణీత సమయానికి కాకుండా ఆలస్యంగా హాజరు నమోదు చేసినట్లు జిల్లా విద్యాశాఖ అధికారులు గుర్తించారు.

దీనిపై తీవ్రంగా స్పందించిన డీఈవో. సంబంధిత 30 మంది ఉపాధ్యాయులకు తాఖీదులు జారీ చేశారు. నోటీసులు అందిన రెండు రోజుల్లోగా తగిన వివరణ ఇవ్వాలని ఆదేశించారు. జిల్లాలోని ఉపాధ్యాయులందరూ విధిగా సమయపాలన పాటించాలని, విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని డీఈవో స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు